
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు తోడుగా ఉంటూ, చంద్రబాబుకు కుడి భుజంగా ఉండేటువంటి కింజరాపు ఎర్రం నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్రం నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవలు అందించేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో ఉండేది కింజరాపు ఎర్రం నాయుడు. చంద్రబాబు నాయుడు అలాగే ఎర్రం నాయుడు ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉంటూ పార్టీ వ్యవహారాలను చూసుకునేవారు. అయితే ఒకరోజు ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తరువాత చంద్రబాబు నాయుడు ఎంతగానో దిగులు చెందారు.
Read also : ఢిల్లీ సీఎంకు Z+ కేటగిరీ భద్రత ఉపసంహరణ, కేంద్రం కీలక నిర్ణయం!
ఇక పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఎర్రం నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు ఒక యువకుడి రూపంలో పార్టీకి కీలక వ్యక్తిగా వెన్నంటే నిలిచారు. తనదైన మాట శైలితో అచ్చం ఎర్రంనాయుడే మళ్లీ వచ్చారు… అన్నట్లుగా అతని మాట తీరు అనిపించేది. అయితే తాజాగా రామ్మోహన్ నాయుడుకు ఒక బాబు జన్మించాడు. గతంలో రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టగా.. రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. ఈ మగ బిడ్డను చూడడానికి ఏకంగా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా వెళ్ళగా.. అక్కడే రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లి ఇటీవల జన్మించిన మగ బిడ్డకు ఆశీర్వాదాలు అందించారు. నా మిత్రుడు ఎర్రం నాయుడు మళ్లీ జన్మించినట్లుగా ఉంది… చాలా సంతోషంగా ఉంది అని చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అందరూ ఒక్కసారిగా ఎర్రం నాయుడు ను గుర్తు చేసుకున్నారు.
Read also : మళ్లీ కేసీఆర్‌కు అస్వస్థత – ఆయన ఆరోగ్యానికి ఏమైంది…?