Homeక్రీడలుఇంగ్లాండ్ బ్యాటర్ సిక్సర్.. స్టేడియంలోని మహిళకి గాయం!

ఇంగ్లాండ్ బ్యాటర్ సిక్సర్.. స్టేడియంలోని మహిళకి గాయం!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఒక క్రికెట్ బ్యాటర్ కొట్టిన సిక్సుకు స్టేడియంలో ఉన్న మహిళా ప్రేక్షకురాలు కంటికి గాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇటలీతో జరిగినటువంటి మ్యాచ్లో భాగంగా ఇంగ్లాండ్ కు చెందిన ఆల్రౌండర్ ఓవర్టన్ భారీ సిక్సు కొట్టాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్ లో ఉన్నటువంటి ఒక మహిళ కంటికి తగలడంతో ఆమె కాసేపు విలవిలలాడిపోయారు. నేరుగా ఆమె కంటికి తగలడంతో కంటి భాగం పూర్తిగా గాయం అయింది. దీంతో వెంటనే స్టేడియంలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది అక్కడికక్కడే ప్రధమ చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడానికి స్టేడియం కి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి అని.. లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది అని అధికారులు సూచిస్తున్నారు.

Tea: ఖాళీ కడుపుతో టీ తాగితే జరిగేది ఇదే!

రాబోయే జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి : జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments