
క్రైమ్ మిర్రర్, పులివెందుల : కడప జిల్లా గండికోటలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి (19) మృతదేహం గండికోట సమీపంలోని ముళ్ల పొదల్లో లభ్యమైంది. విద్యార్థిని శరీరంపై కనీసం దుస్తులు కూడా లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పష్టమైన వివరాలు శవపరీక్ష నివేదిక తర్వాతే తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.