
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ :- జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల పై పటిష్టంగా కొనసాగిస్తున్న ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గాం జిల్లా అఖల్ దేవ్‌సర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. గత మూడు రోజులుగా భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నాయి. ఇప్పటికీ మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. గ్రామ పరిసరాల్లో హైఅలర్ట్ విధించగా, ప్రజలను బయటకి రాకుండా హెచ్చరించారు. భద్రతా బలగాలు – సీఆర్‌పీఎఫ్, ఆర్మీ, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Read also : చౌటుప్పల్‌లో రోడ్డు ప్రమాదం.. బోనాల పండుగకు వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ
ప్రమాదకరమైన ఆయుధాలతో, శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో తలదాచుకుని ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. దాదాపు 72 గంటలుగా కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్ కాశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్రవాద చర్యలు ఉధృతమవుతున్నాయనే అంచనాలకు దారి తీస్తోంది. ఇతర వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. భద్రతా వర్గాలు అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Read also : రావిర్యాలలో గ్రామ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు.. అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ!