
మందమర్రి, క్రైమ్ మిర్రర్:- మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాజెక్టును సందర్శించిన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన ఏడాదిలో కార్మికులు, అధికారులు సమన్వయంతో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. 2026 నూతన సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.అలాగే ఉద్యోగులందరి జీవితాల్లో ఈ సంవత్సరం మరింత సంతోషం, శాంతి, అభివృద్ధి నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.మల్లయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్. వెంకట వంశీధర్, మేనేజర్ కె రామరాజు, సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షులు ఎస్ రమేష్, ఏఐటీయూసీ యూనియన్ ప్రతినిధి ఎం కోటయ్య, వివిధయూనియన్ల నాయకులు పాల్గొన్నారు.
Read also : నూతన సంవత్సర వేడుకల ఖర్చును సేవగా మలిచిన యువత
Read also : ఏమాత్రం తగ్గని అనసూయ… రెచ్చగొట్టే ప్రయత్నమా?





