ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఏలూరులోని బాలిక హాస్టల్ లోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక తరువాత హాస్టల్ యాజమాన్యం చేసిన నిర్వాహకం తెలిస్తే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. ఇక అసలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read More : ఎర్రచందనం చెట్టుకు ఎందుకంత డిమాండ్!.. కిలో ఎంతంటే?
ఏలూరులోని అశోక్ నగర్ లో ఉన్న బాలిక హాస్టల్లో 17 ఏళ్ల మైనర్ బాలిక గత రెండేళ్లుగా హాస్టల్లో చదువుకుంటూ ఉంటుంది. అయితే ఒకసారిగా ఆ బాలిక బాత్రూంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇక వెంటనే ఆ బాత్రూం అంతా క్లీన్ చేసి,హాస్టల్ పై నుంచి శిశువును విసిరేయడంతో ఆ పసికందు అక్కడికక్కడే మరణించింది. ఇక ఈ విషయం పోలీసులకు తెలియగానే వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reda More : బయటపడ్డ హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు..!
అయితే ఇక్కడ గర్భవతి అయిన కూడా ఇప్పటివరకు ఆ బాలికను హాస్టల్ యాజమాన్యం గుర్తించకుండా ఎలా ఉన్నారని పోలీసులు హాస్టల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఇక అంతే కాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అయితే ఇప్పటివరకు హాస్టల్ విద్యార్థుల అడ్మిషన్స్, మెడికల్ మరియు మెయింటినెన్స్ వంటి రికార్డులు కూడా ఆ హాస్టల్లో ఏమీ లేవట. దీంతో పోలీసులు ఈ హాస్టల్ పై కేసు నమోదు చేసుకుని పూర్తిగా విచారణ చేపట్టారు.