
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- రెబల్ స్టార్ ప్రభాస్ ఏ ముహూర్తాన సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారో తెలియదు కానీ నేడు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లేకపోతే పాన్ ఇండియా సినిమాలు వచ్చేవి కావు. ప్రస్తుత రోజుల్లో బాక్సాఫీస్ కు బాహుబలి గా సరికొత్త రికార్డులు సృష్టించడమే కాకుండా.. అమరేంద్ర, మహేంద్ర బాహుబలి అంటూ ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈశ్వర్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రభాస్.. మొదటి కొన్ని సినిమాలలో ఎవరు ఇతను అనే పర్ఫామెన్స్ ఇచ్చి… ఇతనా అనే నటనతో ప్రతి ఒక్కరిని కూడా మెప్పిస్తూ వచ్చారు. చత్రపతి అనే సినిమా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోయారు. ఒకే ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అనుకొని స్టార్ట్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ జర్నీ నేడు దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే తొలి మాటను తెరపైకి ఎక్కించిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి.
ప్రభాస్ సినిమాల లిస్ట్ :-
1. ఈశ్వర్
2. రాఘవేంద్ర
3. వర్షం
4. అడవి రాముడు
5. చక్రం
6. చత్రపతి
7. పౌర్ణమి
8. యోగి
9. మున్నా
10. బుజ్జిగాడు
11. బిల్లా
12. ఏక్ నిరంజన్
13. డార్లింగ్
14. Mr. పర్ఫెక్ట్
15. రెబల్
16. మిర్చి
17. బాహుబలి
18. బాహుబలి 2
19. సాహో
20. రాదే శ్యామ్
21. సలార్
22. కల్కి
ఇలా 22 సినిమాల్లో నటించిన ప్రభాస్ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇతర హీరోలకు కొంతమంది అభిమానులు ఉండొచ్చు.. కానీ అందర హీరోల అభిమానులకు నచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రభాస్. అలాంటి ప్రభాస్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక విషెస్ తెలుపుతున్నాం.
పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ గారు