జాతీయం

కుక్క కోసం ఈడీ సోదాలు.. బెంగళూరులో కలకలం

ఓ కుక్క కోసం ఈడీ సోదాలకు దిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేవలం ఓ కుక్క కోసం దేశంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలో ఉందంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తోడేలు, కుక్క రెండింటి లక్షణాలు గల హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్ తో ఫోటోలతో ఫోజుకొట్టాడు. ఈ అరుదైన పెంపుడు కుక్క ఖరీదు దాదాపు భారత కరెన్సీలో అక్షరాలా 50 కోట్ల రూపాయలని ప్రచారం చేసుకున్నాడు. ఈ కుక్క ధర విని అందరూ ఆశ్చర్యపోయారు… దీని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు.

దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ కుక్క గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్‌గా తేలింది. వోల్ఫ్‌ డాగ్‌ను కలిగివున్నట్లు… దానికోసం 50 కోట్లు ఖర్చుచేసానని సదరు బెంగళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తేలింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగివున్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సదరు వ్యక్తి సతీష్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు. దీంతో అసలు నిజం బయటపడింది… ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేసాడని తేలింది.

బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట రోడ్డులో సతీష్ ఇంట్లో ఈడీ దాడులు చేపట్టింది. సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవీ లేవని ఈడి తేల్చింది. అతడివద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని… వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికే అతడు చాలామందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అరుదైన, ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయజాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీలాండరింగ్ కు పాల్పడి ఉండవచ్చని ఈడి అధికారులు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు, సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు

  2. నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

  3. అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

  4. సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్

  5. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button