Homeక్రైమ్Big breaking: ఐ-ప్యాక్ పై ఈడీ దాడులు.....రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నం...!

Big breaking: ఐ-ప్యాక్ పై ఈడీ దాడులు…..రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నం…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల సంస్థ‌(ఐ-ప్యాక్‌)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) చేప‌ట్టిన దాడులు దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. గురువారం ఉద‌యం నుంచే ఐ-పాక్‌పై ఈడీ అధికారులు మెరుపు ఏక కాలంలో అనేక చోట్ల మెరుపు దాడులు నిర్వ‌హించారు. దీంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి.

మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు…

ఐ-ప్యాక్మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో గురువారం ఉద‌యం నుంచే దేశ వ్యాప్తంగా ఉన్న ఐ-ప్యాక్ కార్యాల‌యాలు, ఆ సంస్థ‌తో సంబంధం ఉన్న కీల‌క వ్య‌క్తుల నివాస‌ల‌పై సోదాలు నిర్వ‌హిస్తున్నారు. హైదరాబాద్ (బంజారాహిల్స్, గచ్చిబౌలి), బెంగళూరు, ముంబై, కోల్‌కతా మరియు ఢిల్లీ సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివిధ రాజ‌కీయ పార్టీల నుంచి ఐ – ప్యాక్ అందుకున్న నిధుల విష‌యంలో మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో ఈడి రంగంలోకి దిగింది.: ఐప్యాక్ ఫౌండర్లు, కీలక భాగస్వాముల నివాసాల్లో డిజిటల్ సాక్ష్యాలు, బ్యాంకు లావాదేవీలు మరియు హవాలా మార్గాల్లో నిధులు మళ్ళించినట్లు ఉన్న అనుమానిత పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా విదేశీ నిధులు అందిన‌ట్లు ఆరోప‌ణ‌లు…

రాజకీయ ప్రచారాల పేరుతో పెద్ద ఎత్తున విదేశీ నిధులు అక్ర‌మంగా నిబంధనలకు విరుద్ధంగా సంస్థలోకి వచ్చాయనేది ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐప్యాక్‌తో సంబంధం ఉన్న కొన్ని అనుబంధ సంస్థలు మరియు షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చినట్లు ఈడీ అనుమానిస్తోంది. గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఐప్యాక్ దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి.

రాజ‌కీయ పార్టీల్లో గుబులు…

ఐప్యాక్ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఆ సంస్థతో ప్రత్యక్షంగా సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, ఈ సోదాలు ఆయన స్థాపించిన పాత నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టాయి. గతంలో ఐప్యాక్ సేవలు పొందిన వైసీపీ , తృణమూల్ కాంగ్రెస్, ఇత‌ర‌ పార్టీల నేతల్లో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నిధుల మూలాలు ఎక్కడికి వెళ్తాయో అన్న‌దానిపై దృష్టిసారించాయి. ఇంకా సోదాలు కొన‌సాగుతున్నాయి. ఈ త‌నిఖీలు పూర్త‌యిన త‌రువాత ఈడి అధికార ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments