ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం జిల్లా పొదిలి లో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ జనం!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా,పొదిలిలో భూప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా ప్రజలు చెబుతున్నారు. అకస్మాత్తుగా వచ్చినటువంటి భూ ప్రకంపనల దాటికి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవ్వడమే కాకుండా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో ఉదయం లేచి చూసేసరికి ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ గా నిలిచింది. ఇక కొద్ది సెకండ్లలోనే భూమి కంపించడం ఆగడంతో ప్రజలందరూ ఊపిరిపించుకున్నారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని.. ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ఘటనలో ఎక్కడా కూడా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగలేదు అని స్పష్టం చేశారు. ఇక ఈ ప్రాంతాన్ని లోతుగా పరిశీలించేందుకు సర్వే చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ను స్థానిక అధికారులు కోరారు. అయితే గతంలో మే నెలలో కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతంపై లోతుగా సర్వే జరిపిన తర్వాత నిపుణులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Read also : రాజకీయాల్లోకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. వార్డు నెంబర్ గా ఏకగ్రీవం

Read also : Today Gold Price: వెనక్కి తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button