
పాకిస్తాన్, టర్కీల్లో వరసుగా భూప్రకంపనలు వస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ రెండు, టర్కీలో మూడు సార్లు భూమి కంపించింది. పాకిస్తాన్ తో భారత్ యుద్ధం, పాక్ భూభాగంలో భారత వైమానిక దాడుల నేపథ్యంలో టర్కీ, పాకిస్తాన్, చైనాను వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6గంటల 30నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంకానీ జరగలేదు. భూకంపం ధాటికి చైనా ప్రజలు భయపడి, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.
మరోవైపు తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం 36.56°N అక్షాంశం, 70.99°E రేఖాంశం వద్ద, 120 కిలోమీటర్ల లోతులో ఉంది. గురువారం తెల్లవారుజామున టర్కీలోని కోన్యా నగరంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు రోజు పాకిస్తాన్ లోనూ 4.8 తీవ్రతతో భూమి కంపించింది. వరుస ప్రకంపనలతో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. పాక్ తో యుద్ధం సందర్భంగా భారత్ బ్రహ్మోస్ మిసైల్లు ప్రయోగించింది. పాక్ ఎయిర్ బేస్ లు టార్గెట్ గా భారత్ 12 బ్రహ్మోస్ మిసైళ్లు ప్రయోగించింది. ఒక మిసైల్ పాక్ న్యూకియర్ కేంద్రం ఉన్న నూర్ ఖాన్ బేస్ పై పడిందనే వార్తలు వస్తున్నాయి.
భారత్ మిసైల్ దాడిలో పాకిస్తాన్ అణుకేంద్రాలకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నుర్ ఖాన్ బేస్ తీవ్రంగా ధ్వంసం అయిందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ దాడిలో పాక్ అణు రియాక్టర్ స్వల్పంగా ధ్వంసం అయిందని.. రేడియన్ లీక్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. రేడియన్ ప్రభావం వల్లే పాకిస్తాన్, టర్కీ, చైనాలో భూ ప్రకంపనలు వస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.