
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఏఐసీసీ (AICC) డ్రాఫ్టింగ్ కమిటీ మేనిఫెస్టో సభ్యుడిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చోటు కల్పించింది. దీంతో.. భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ నేతలు.
ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీ… ఇది చాలా కీలకమైంది. ఎన్నికల మేనిఫెస్టోలు, పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్ణయాలను చూసుకుంటుంది. అలాంటి కమిటీలో భట్టి విక్రమార్కకు చోటు దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో అహ్మదాబాద్‌లో జరగబోయే పార్టీ కీలక సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో AICC కీలక నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలు, మేనిఫెస్టోల్లో మార్పులతోపాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు.
Also Read : ప్రమాదమా..? హత్యా..? 12 సెకండ్ల ముందు ఏం జరిగింది – పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
భట్టి విక్రమార్క.. సౌమ్యుడు. వివాద రహితుడు. సీఎం అయ్యే అర్హతలు కూడా ఆయనకు ఉన్నాయి. కానీ… అధిష్టానం రేవంత్‌రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ఎంపిక చేసినా… ఆయన కట్టుబడి ఉన్నారు. ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా సాయం చేస్తూ.. తెలంగాణలో మంచి పాలన అందించడంలో సహాయపడుతున్నారు. అధిష్టానం మాటను భట్టి విక్రమార్క ఎప్పుడూ జవదాటలేదు. ఆయనపై హైకమాండ్‌కు కూడా మంచి అభిప్రాయం ఉంది. కనుక.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఇవ్వలేకపోయినా… డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టారు పార్టీ పెద్దలు. అంతేకాకుండా… కీలకమైన ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీలోనూ చోటు కల్పించారని.. కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.