
శ్రీకాకుళం, క్రైమ్ మిర్రర్: “ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది” అనే సామెత ఉత్తరాంధ్రలో ఎంత బాగా సరిగ్గా ఉపయోగిస్తారో, దాని అర్ధాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నట్లున్నారు టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గతంలో ఫైర్ బ్రాండ్, కుటుంబం గురించి పద్యంలో సంచలనం సృష్టించిన ఈ నేత… ఇప్పుడు అదే కుటుంబం నుంచే పరాభవాన్ని చవిచూస్తున్నారు.
భార్య దువ్వాడ వాణి జడ్పిటిసి సభ్యురాలిగా ఉన్న ఆమె… తాజాగా తన భర్త శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ పరువు పాడు చేస్తున్నాడని, కుటుంబాన్ని రోడ్డున పడేశాడని వాపోయారు. వివాహేతర సంబంధం, భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేశాడని ఆమె ఆరోపణలు తీవ్రంగా వినిపించారు.
ఈ నేపథ్యంలో జగన్ తాత్కాలికంగా శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. కానీ ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించి ఆయనను పార్టీ నుంచే సస్పెండ్ చేసినట్లు సమాచారం. పార్టీలో తీవ్రమైన అప్రతిష్ట కలిగించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వాణి మాత్రం తాను చేసిన మొక్కులను తీర్చుకుంటూ, దేవుళ్లకు నైవేద్యాలు అర్పిస్తూ విహారయాత్రలతో మమేకమవుతోంది. మోడ్రన్ డ్రెస్‌లలో ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఆనందం చూస్తే, ఆమె పంతం నెగ్గిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, దివ్వెల మాధురి వ్యవహారం కూడా ఈ డ్రామాకు మరో కోణాన్ని జతచేస్తోంది. మాధురి – శ్రీనివాస్ సంబంధం విషయమై గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు వాణి విజయం, శ్రీనివాస్ క్షీణత నేపథ్యంలో మాధురి పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఈ వ్యవహారం ఎంత మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.