
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు దసరా సెలవుల కోసం తెగ ఆలోచిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు అనేవి సెప్టెంబర్ చివరివారం లో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ హాలిడేస్ షెడ్యూల్ అనేవి భిన్నంగా ఉన్నాయి.
ఇక మొదటగా 2025 ఆంధ్రప్రదేశ్ దసరా సెలవులు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. దాదాపు తొమ్మిది రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక అక్టోబర్ 3 నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
Read also : మహేశ్వరం బిటిఆర్ మ్యాక్ ప్రాజెక్టులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఇక తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు మరింత ఎక్కువ రోజులు ఇవ్వనున్నారన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు.. అనగా దాదాపు 13 రోజులు పాటు పాఠశాలకు సెలవులు ఇవ్వనున్నారు. కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు తేదీలకు దసరా సెలవులు ఉండడంతో.. కుటుంబ పర్యటనలు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లేటువంటి ప్రణాళికలు ఏమైనా ఉంటే ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాం.
Read also : నన్ను ఆపేదెవడు.. రేవంత్ పై రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి