
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ఈసారి దసరా పండుగకు సంబంధించి సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. మొదటగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఈనెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అధికారులు సెలవులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు అలాగే ఎయిడెడ్ స్కూళ్లకు కూడా 21వ తేదీ నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు సెలవులు ఖరారు చేశారు. ఇక అక్టోబర్ 4 నుంచి తరగతులనేవి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణ జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు అనేవి ఉండనున్నాయి. ఆరవ తేదీ నుంచి తిరిగి క్లాసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Read also : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త పేరు?
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వబోతున్నారు. మరుసటి రోజు అక్టోబర్ మూడు నుంచి తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ఏపీలో జూనియర్ కాలేజీల విషయంలో ఇంకా స్పష్టత అనేది రాలేదు. కానీ స్కూళ్లకు ఇచ్చిన సెలవులు ప్రకారమే కాలేజీలకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు దసరా సెలవుల తేదీలను ఉత్తర్వులు ఇవ్వడం తో విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ముందుగానే పండుగకు సంబంధించి లేదా ప్రయాణాలకు సంబంధించి తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సమయంలోనే బతుకమ్మ పండుగ అనేది ఘనంగా చేస్తుంటారు. దసరా సమయంలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఇతర నగరాల నుంచి వచ్చే వ్యక్తులకు రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దసరా పండుగ అంటేనే కేవలం విద్యార్థులకు మాత్రమే పండుగే కాదు… దసరా అంటేనే ఒక కుటుంబ పండుగ. కాబట్టి కుటుంబంలోని వ్యక్తులందరూ భాగమై.. ఆనందంగా, ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also : సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు.. ఇక రాజీనామానే?