
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారుచేసి సరఫరా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కల్తీ మద్యం పై ఇప్పటికే పలు నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు నారావారి కల్తీ మధ్యమంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న సందర్భంగా తాజాగా ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు:-
1. మొదటగా మద్యం బాటిల్ పై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసిన తర్వాతే మద్యం అమ్మాలి
2. మద్యం దుకాణాలు నడిపేవారు సురక్ష యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సీసాను స్కాన్ చేయాలి
3. ప్రతి దుకాణం అలాగే బారు వద్ద విక్రయించే మద్యం నాణ్యమైనదిగా ధ్రువీకరించినట్లు ప్రత్యేకమైన బోర్డులు ప్రదర్శించాలి
4. ప్రతి దుకాణం అలాగే బార్ లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలి
5. మద్యం దుకాణాల్లో ర్యాండమ్ గా ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించాలి
6. నకిలీ మద్యం గుర్తిస్తే షాప్ లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి
కాబట్టి పైన పేర్కొన్న ఈ ఆరు సూచనలు ప్రతి ఒక్క మద్యం దుకాణాల యజమానులు పాటించాలని కోరారు. ఎక్సైజ్ శాఖ తీసుకువచ్చినటువంటి ఈ కొత్త నిబంధనలను పాటించకపోతే లైసెన్సు రద్దుతోపాటుగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read also : రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరు
Read also : బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠత.. రేపే విచారణ..!