
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెంథా తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు కూడా ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా సెలవులు రద్దు చేస్తున్నట్లుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Read also : తెలంగాణకు రేపు కనివినిఎరుగని రీతిలో భారీ వర్షాలు..!
ప్రతి గ్రామంలోనూ విద్యుత్ సరఫరా లో ఎటువంటి సమస్యలు తలెత్తుకుండా వెంటనే పునరుద్ధరించాలని కీలక ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే పవర్ సప్లై లో ఏమైనా అంతరాయాలు కలిగితే వెంటనే 1912 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలకు సూచించారు. ఈ వర్షాల నేపథ్యంలో చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు కిందపడే అవకాశం ఉన్నందున… ఎవరు కూడా చెట్ల కింద అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికే కాకుండా ఈ తుఫాన్ ఎఫెక్ట్ పలు రాష్ట్రాలకు కూడా పొంచి ఉండడంతో ఇప్పటికే ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే NDRF మరియు SDRF బృందాలను పంపించి సహాయక చర్యలకు సంసిద్ధమయ్యారు.
Read also : ఏంటి ఈ పరిస్థితి… ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చేరట్లేదు?





