క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెంథా తుఫాన్ నేపథ్యంలో ఏకంగా 22 జిల్లాల్లోని స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఒక్క ఉమ్మడి కర్నూల్ అలాగే అనంతపురం జిల్లాలో మాత్రం సెలవులు ఇవ్వలేదు. తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తుఫాన్ కాకినాడ తీరం దాటే అవకాశాలు కనిపించడంతో కాకినాడలో ఇవ్వాల్టి నుంచి దాదాపు 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు మరియు కాలేజీలకు సెలవు అయితే ప్రకటించేశారు. ఇక మిగతా 21 జిల్లాలలో ఒకరోజు నుంచి మూడు రోజులు వరకు కలెక్టర్ నిర్ణయించిన ఆదేశాల మేరకు సెలవులు ఇచ్చారు. రేపు రాత్రికి ఈ తుఫాన్ మచిలీపట్నం నుంచి తీరం దాటే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై అప్డేట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు అన్ని అధికార యంత్రాంగాలు ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరుకున్నాయి. హోంమంత్రి ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి నేవీ హెలికాప్టర్లను తెప్పించి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Read also : తుఫాన్ హెచ్చరికల వేళ… విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు : మంత్రి గొట్టిపాటి
మరోవైపు ఈ తుఫానులు కారణంగా ఎన్నో నష్టాలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. తుఫాన్లు కోస్తాంధ్రను గతంలో అతలాకుతలం చేసే అనడంలో ఎటువంటి సందేహాలు లేవు. 1971 నుంచి 2023వ సంవత్సరం వరకు కూడా దాదాపు 60 తీవ్రమైన సైక్లోన్లు తీరం దాటాయి. వీటి ప్రభావం కారణంగా ఎంతో ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇదే సందర్భంలో నేడు ఈ మెంథా తుఫాను ఎలాంటి నష్టాన్ని చేస్తుందో అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆందోళనతో భయపడుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా మార్చి నుంచి జూన్ వరకు… సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు సీజన్లలో సైకోన్లు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కానీ ఈసారి వాతావరణ మార్పులతో అక్టోబర్ నెలలోనే ఈ తుఫాన్లు దూసుకు వస్తున్నాయి. కాబట్టి ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు
Read also : ఏంటి ఈ పరిస్థితి… ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చేరట్లేదు?





