తెలంగాణ

మహాదేవపూర్ లో దుద్ధిల్ల శ్రీనుబాబు పర్యటన

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :-జయశంకర్ జిల్లా, మహాదేవపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం TPCC ప్రధాన కార్యదర్శి దుద్ధిల్ల శ్రీను బాబు పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కలిసి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ఇదే క్రమంలో సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో సూరారంలో కాంగ్రెస్ అభ్యర్థి (సర్పంచ్..) విజయం సాధించడంతో విజయానికి కృషిచేసిన చల్ల రమేష్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తులసి మహేష్, చిన్నోళ్ల రాములు, గోడిశల మని మరియూ తదితరులు పాల్గొన్నారు.

Read also : జాతీయ రహదారి పనుల్లో నాసిరకం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంట్రాక్టర్

Read also : ‘నా భర్త మగాడు కాదు’.. హనీమూన్ నుంచి వచ్చి నవ వధువు షాకింగ్ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button