
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం ఏపీ నుంచి దుబాయ్ కి వెళ్ళిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే నేడు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి పలు కంపెనీలతో చర్చించారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, అక్కడి మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించి ఎన్నో విషయాల గురించి చర్చించారు. వచ్చే నవంబర్ నెల 14, 15వ తేదీన ఏపీలోని విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి CII ఇన్వెస్టర్స్ మీట్ కు చాలామందిని ఆహ్వానించారని సమాచారం. అలాగే నిన్న గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ముచ్చటించారు. కాగా దుబాయ్ పర్యటన ముగించుకొని అనంతరం నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో రాజధాని అమరావతి రూపురేఖలను తీర్చిదిద్దుతున్న చంద్రబాబునాయుడు google ని తీసుకువచ్చి మరింత అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే 2047 లోపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రముగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Read also : బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం?
Read also : AI పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్న టీడీపీ ఫాలోవర్స్





