
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్ :- మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ఇలాంటి వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోమ నరసయ్య హెచ్చరించారు. డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు పట్టణంలో గత కొద్దిరోజులుగా ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు గురువారం తెలిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు సహా వందలాది వాహనదారులను తనిఖీ చేసి, మద్యం సేవించినట్లు తేలిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు డజన్లకొద్దీ కేసులు నమోదు చేసి, సంబంధిత వాహనాలను సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం తమకే కాకుండా, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని, ఇది ఒక సామాజిక సమస్యగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పదు. కాబట్టి ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తపడాలి అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి. రాంబాబు, సిబ్బంది పాల్గొని తనిఖీలు చేపట్టారు.
Read also : చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ అభివృద్ధి పనుల పర్యటన
Read also : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుంకరి భిక్షం గౌడ్