తెలంగాణ

రైతుల దాహార్తి కై ప్రతి షెడ్డులో తాగునీటి సౌకర్యం..

క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :-శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గల మూడు షెడ్లలో రైతుల కొరకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాసేపు చంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఆయన ఏఎంసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శంకర్ పల్లి మార్కెట్ లో ఉల్లిగడ్డ సీజన్ మొదలైందని చెప్పారు.

ఉల్లిపాయలు తీసుకువచ్చే రైతుల కొరకు, వ్యాపారస్తులకు ప్రతి షెడ్ లో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఉల్లిపాయలు సీజన్ 3 నెలల వరకు ఉంటుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎండి. సర్ తాజ్, కె. సుధాకర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.

  1. హెచ్‌సీయూ వర్సెస్‌ ప్రభుత్వం – 400 ఎకరాల భూమిపై ఎవరి వాదన కరెక్ట్‌…?

  2. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ( యువ తేజం ) మెగా జాబ్ మేళా

Back to top button