DRDO Pralay Missiles Test: దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక టెక్నాలజీతో డీఆర్‌డీఓ రూపొందించిన రెండు ప్రళయ్ క్షిపణుల (Pralay missiles) టెస్ట్ ఫైర్ విజయవంతమైనట్టు రక్షణ శాఖ తెలిపింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ మిసైళ్లను ప్రయోగించారు. ఒకే లాంఛర్ నుంచి వరుసగా వీటిని ప్రయోగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఈ క్షిపణని అభివృద్ధి చేసింది.
రెండు మిస్సైల్స్ టెస్ట్ సక్సెస్
ఆపరేషనల్ కండిషన్ల కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయిల్స్‌లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు వెల్లడించింది. మిసైల్ ఫ్లైట్ తుది దశ వెరిఫికేషన్ కూడా విజయవంతమైందని చెప్పింది.
గత ఆగష్టులో అగ్ని 5 పరీక్ష విజయవంతం
గత ఆగష్టులో ఇంటర్ మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని 5ని DRDO సక్సెస్ ఫుల్ గా టెస్ట్ చేసింది. ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష జరిగింది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఈ పరీక్ష నిర్వహించింది. భారత అమ్ములపొదిలోకి మరో అణ్వాయుధాన్ని తీసుకొచ్చింది. అగ్ని 5ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్ లో అగ్ని 5 అత్యంత అత్యాధునికమైన మిస్సైల్. ఇది ఉపరితలం మీద నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. అగ్ని 5 రేంజ్ ను మరింత పెంచడానికి డీఆర్‌డీఓ ప్రయత్నిస్తోంది. 7,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేలా మార్పులు చేయాలని చూస్తోంది. అగ్ని 5 ఒకే సారి మూడు బాంబులను పేల్చగలదు. మరోవైపు డీఆర్‌డీఓ అగ్ని 5లో కొత్త వేరియంట్లను అభివృద్ధి చేస్తోంది.





