ఆంధ్ర ప్రదేశ్

డ్రాయర్ల కంపెనీ వెలగొట్టినోడివి.. డేటా సెంటర్లు తెచ్చావా : టీడీపీ ఎమ్మెల్యే

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్స్ వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విశాఖ డేటా సెంటర్ వెనుక వైసీపీ పార్టీ కృషి ఎంతగానో ఉంది అని.. 2023 మే 3వ తేదీన శంకుస్థాపన మా పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నంకు వస్తున్నటువంటి డేటా సెంటర్ వెనుక మా పార్టీతోపాటు అదాని, కేంద్ర ప్రభుత్వం అలాగే సింగపూర్ గవర్నమెంట్ కృషి ఎంతగానో ఉంది అని… అప్పట్లో డేటా సెంటర్ కు ఫౌండేషన్ వెయ్యకపోతే ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేది కాదు అని జగన్మోహన్ రెడ్డి తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

Read also : నేడు మరో అల్పపీడనం.. ఈదురు గాలులతో భారీ వర్షాలు

అయితే తాజాగా జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ జగన్ పై సెటైర్లు వేశారు. డ్రాయర్ల కంపెనీని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిన మీరు ఇప్పుడు డేటా సెంటర్లు తెచ్చామని మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు. అప్పటి కాలంలో రాష్ట్రంలో కియా తీసుకువచ్చింది తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నాడు. మళ్లీ ఇప్పుడు గూగుల్ తానే తెచ్చాను అని గొప్పలు చెప్తున్నాడు. ఇలా చెప్పుకోవడానికైనా కొంచమైనా సిగ్గుండాలి అని సోమిరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు జగన్ కి కొంచెం మాత్రమే పిచ్చి ఉందని అనుకున్నాము… కానీ ఇప్పుడు పూర్తిగా పిచ్చోడని అర్థమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. దీంతో జగన్ పై సోమిరెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.

Read also : ట్రంప్ విధించిన ఆంక్షలు పై పుతిన్ రియాక్షన్ ఇదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button