
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- మునుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మజ్యోతిబాపూలే బాలికల పాఠశాల ను స్పెషల్ ఆఫీసర్ మరియు డిపిఓ వెంకటయ్య,ఎంఇఓ తలమల్ల మల్లేశం తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్దులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించి,పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు.
మెనూ ప్రకారం విద్యార్దులకు భోజనం అందించాలన్నారు.అలా చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో పాల్గొన్నారు. ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి,ఇంచార్జీ తహశీల్దార్ నరేష్, సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి,డాక్టర్ నర్మద ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Read also : 10 లక్షల అప్పు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. సరదాగా AI ని ప్రశ్నించాడు.. చివరికి?
Read also : బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో!





