
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను డిపిఓ శంకర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతిగదిలో విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని,ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహశీల్దార్ నరేష్,ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి,సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది విద్యార్దులు ఉన్నారు.





