బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది దాదాపుగా పది రోజుల తర్వాత బలహీనపడడం జరిగింది. దీని కారణంగా రాబోయే రోజుల్లో వర్షాలు అనేవి తగ్గిపోనున్నాయి. అయితే ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. దీంతో ఎంత త్వరగా వర్షాలు తగ్గిపోతే అంత మంచిదని వ్యవసాయదారులు చెప్పుకొస్తున్నారు.
టాలీవుడ్ పెద్దలను గంట వెయిట్ చేయించిన రేవంత్ రెడ్డి!
అయితే ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తాజాగా IMD తెలిపింది. కాబట్టి ప్రజలు ఇకపై ఊపిరి తీసుకోవచ్చని, భారీ వర్షాలు ఇకపై పడేటువంటి అవకాశం వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఏడు రోజు సంతాప దినాలు
కాగా మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరి కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపింది. అయితే వచ్చేటువంటి వేసవి కాలం వరకు ఎటువంటి అల్పపీడనాలు మరియు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పింది.