
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ప్రస్తుత రోజుల్లో ధనవంతుడైన లేదా మధ్యతరగతి వాడైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అంటే స్తోమతకు మించి పెళ్లిళ్లు లేదా ఇతర ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఉన్న అప్పులు అలానే ఉండగా… మళ్లీ ఈ ఫంక్షన్లకు కొత్త అప్పులు పెరగడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. కేవలం చుట్టుపక్కల ప్రజలను, బంధువులను మెప్పించడానికి అప్పులు చేసి మరీ కార్యక్రమాలను ఘనంగా జరిపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆయా కుటుంబాల్లో శాంతి ఉండడం లేదని తాజాగా చెన్నై కు చెందిన ఒక టెక్ ఉద్యోగి తన జీవితంలో జరిగిన ఒక విషయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
Read also : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. జర్నలిస్టులు సహా 20 మంది మృతి
ఒక కోటీశ్వరుడికి పెళ్లి అంటే.. అది మరొక కోటీశ్వరుడుతోనే జరుగుతుంది కాబట్టి వాళ్ల స్తోమతకు తగ్గట్లు ఘనంగానే పెళ్లి నిర్వహిస్తారు. కానీ సామాన్య మధ్యతరగతి వ్యక్తికి ఇవన్నీ అర్థం కావు. నేను అలాగే మా బ్రదర్ ఇద్దరం దాదాపు 4 సంవత్సరాలు కష్టపడి మా కుటుంబానికి ఉన్నటువంటి మొత్తం అప్పులని తీర్చేసామని అన్నారు. అయితే అప్పులు తీరిపోయాయని రిలాక్స్ అయ్యే లోపే పేరెంట్స్ మళ్లీ మాకు పెళ్లిచేయాలనీ చెప్పేసి మాకోసం బంగారం కొనడం, ఇంటికి దాదాపు 1000 మంది వరకు పిలుద్దాం.. వారికి మర్యాదలు చేద్దామని చెప్పి దాదాపు 17 లక్షల రూపాయలు వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పుల వల్ల కుటుంబ ఆనందం, అలాగే జాబ్ చేస్తున్న మాకు EMI ల రూపంలో చేతికి వచ్చిన డబ్బు అటునుంచి పోతూనే ఉందని చెప్పుకొచ్చాడు. మనకోసం ఏమైనా మిగిలించుకుందామంటే.. ఈ అప్పుల వల్ల అది జరగట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. నలుగురు మెప్పుకోసం ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే.. కచ్చితంగా ఇబ్బంది పడతారని.. నాలాగా ఎవరు ఇబ్బంది పడకండి అని ఒక ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు విన్నపించాడు. సోషల్ మీడియాలో ఈ విషయం చదివిన చాలా మంది నిజమే గురు అని కామెంట్లు చేస్తున్నారు. స్తోమతకు మించి ఆడంబరాలకు పోకుండా ఉండడమే మంచిది అని చర్చిస్తున్నారు.
Read also: భారత్ పై కావాలనే టారిఫ్స్, జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!