
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మెగాస్టార్ చిరంజీవి,అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చినటువంటి “మన శంకర్ వరప్రసాద్ గారు” సినిమా పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలోని కొన్ని డైలాగ్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో పాపులర్ డైలాగులలో ఒకటైనటువంటి “మద్యపానం మహాదానందం” సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అని.. ఎంతోమంది వెరైటీగా రీల్స్ చేస్తున్నారు అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ పిల్లలకు మాత్రం ఈ రీల్ చూపించొద్దు అన్నారు. అంతేకాకుండా ఈ డైలాగుతో పిల్లల చేత రీల్స్ చేయించొద్దు అని తల్లిదండ్రులతో పాటు యువతను కూడా కోరుకున్నారు. దీంతో అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Read also : రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ చేయాలి : మాజీ క్రికెటర్
Read also : చద్దన్నం తింటే ఏమవుతుందో తెలుసా?





