
-రావిర్యాలను జన్నాయి గూడను ఒకే వార్డులో కలపాలని డిమాండ్…?
-శంషాబాద్ జోనల్ కమిషనర్ కు వినతిపత్రాన్ని అందచేసిన గ్రామస్తులు
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం మండలం రావిర్యాల,జన్నాయిగూడ ను ఒకే వార్డులో కలపాలని
శంషాబాద్ జోనల్ కమిషనర్ వినతిపత్రాన్ని అందచేసిన గ్రామస్తులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న జన్నాయిగూడ గ్రామాన్ని మంఖాల్ గ్రామంలో విలీనం చేయడం సరికాదన్నారు. మంఖాల్ లోకలపడం వ్యతిరేకిస్తు… అవేదన వ్యక్తం చేశారు. మేము పూర్వం నుండి జన్నాయిగూడలో నివసిస్తున్నాము. మా గ్రామం ఏర్పడినప్పటి నుండి రావిర్యాలతో మాకు అన్న దమ్ముళ్ల లాగా అన్ని అనుబంధాలు రావిర్యాల తోటే ఉన్నాయి. మాకు ప్రత్యేక రెవెన్యూ కూడ లేదు మాకు అన్ని సౌకర్యాలు రావిర్యాలతో అనుసందమై ఉన్నాయి కాబట్టి దయచేసి మా రెండు గ్రామాలను విడదీసి మమ్మల్ని దూరం చెయ్యొద్దన్నారు. జన్నాయిగూడను రావిర్యాలతో 66వ డివిజన్ లో విలీనం చేస్తూ రావిర్యాల గ్రామాన్ని సర్కిల్ ఆఫీసుగా చేయాలని శంషాబాద్ జోనల్ కమిషనర్ కి కోరారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మాజీ చైర్మన్,కాంటేకార్ మధుమోహన్,మాజీ కాన్సిలర్లు భవాని వెంకట్ రెడ్డి,బోధ యాదగిరి రెడ్డి,గ్రామస్తులు గోదాసు నరసింహ,పిట్టల రవి,గోదాసు జంగయ్య,పిట్టల శ్రీశైలం,గోదాసు ఇబ్రహీం,పిట్టల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Read also : తలనొప్పి అని సెలవు అడిగితే.. మేనేజర్ షాకింగ్ రిప్లై?
Read also : అసలే శీతాకాలం.. పైగా దగ్గు వస్తుందా?.. అయితే పడుకునే ముందు ఇలా చేయండి!





