
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఉచిత పథకాలు ప్రకటించడం ఈ మధ్య చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. గెలుపు కోసం నోటిలో నుంచి ఉచిత పథకాలు మాటలు చాలా సులభంగా వస్తున్నాయి. కానీ అవి తీర్చే సమయంలో చాలానే అప్పులు చేయాల్సి వస్తుందని… దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉచిత పథకాలు కంటే అభివృద్ధి పై దృష్టి సారించాలని వెంకయ్య నాయుడు కోరారు. ఎన్నికల్లో గెలవడం కోసమో లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమో.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని ప్రకటించడం ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందని.. దీనివల్ల అప్పులు పెరిగిపోయి అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదని విలేకరుల సమావేశంలో తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : కట్టడాలను తొలగించకుండా కాపు కాస్తుంది ఎవరు..?
ఏవైనా కూడా మంచి పనుల కోసం అప్పులు చేస్తే ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. అందలో భాగంగానే దీర్ఘకాలిక ప్రాజెక్టులు అంటే సాగునీరు లేదా విద్యుత్ వంటి నిర్మాణాల కోసం అప్పులు చేయడం వల్ల భవిష్యత్తు తరాలలో చాలా ప్రయోజనం ఉంటుందని సూచించారు. ఏవి పడితే వాటికి ఉచితాలు ఇవ్వకూడదు.. మనదేశంలో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యకు అలాగే వైద్యంపై ఎక్కువగా దృష్టి సారించి వీటిపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్య వలనే ఎవరి జీవితాలు అయినా మారిపోవచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరోవైపు వైద్యం కూడా ఇప్పట్లో ప్రతి ఒక్కరికి అవసరమవుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు వీటిపై తక్కువ ధరలో ప్రజలకు మేలు చేయాలి కానీ ఏవి పడితే వాటిపై ఉచితాలు ప్రకటించవద్దు అని సూచించారు.
Read also : తెలంగాణలో పోటీ చేయటం లేదు.. సీఎం కీలక నిర్ణయం!