*50 మంది పేద పిల్లలకు మంచి భోజనం అందజేత*
*సర్పంచ్‌గా ఎలికట్టి భరత్ న్యాయకత్వం లో ఆగదు గ్రామాభివృద్ధి*
*క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిది:* తెలంగాణా లో గ్రామపంచాయితి ఎన్నికలు బుదవారం తో ముగిసిన విషయం తెలిసిందే. సర్పంచ్ గ గెలుపొందితే గ్రామంలోని అందరికి ఐదు సంసారాలు ఉచితంగా కటింగ్ చేస్తాం, గ్రామంలో ఉచిత వైఫై ఇస్తాం, గుడి కట్టిస్తాం , లైట్స్ ఎపిస్తం అంటూ రాకరాలుగా హామీలు ఇచ్చిన విషయం కూడా తెల్సిందే.
అయితే తెలిసిన స్టొరీ లు ఎందుకు చెపుతున్నాను అనుకుంటున్నారా…? అక్కడికే వస్తున్న నల్గొండ జిల్లా వేములపల్లి మండలము లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా ఎలికట్టి భరత్ ను గెలిపిస్తే 50 మంది పేద పిల్లలకు అన్నదానం చేయిస్తానని భరత్ అన్న సైన్యం యువకులు హాని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా ఎలికట్టి భరత్ ను ప్రజలు ఘన విజయం వైపు నడిపించారు.

ఈ సందర్భంగా గ్రామంలో హృదయాలను హత్తుకునే సేవా కార్యక్రమం మొదలు పెట్టారు భరత్ అన్న సైన్యం యువకులు. సర్పంచ్‌గా భరత్ గెలిస్తే 50 మంది పేద పిల్లలకు అన్నదానం చేయిస్తానని భరత్ అన్న సైన్యం యువకులు చేసిన మొక్కును నెరవేర్చుతూ గురువారం ఇటుక బట్టిలో మగ్గుతున్న పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఆ పిల్లలతో కేక్ కట్ చేసి కాంగ్రచులేషన్స్ భారత్ అన్నా అంటూ నినాదాలు చేశారు.

అనంతరం అ పేద పిల్లలకు మంచి రుసికరమైన భోజనం అందించారు. ఈ సందర్భంగా పిల్లల, కుటుంబ సబ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ప్రశంసలను అందుకుంది. గ్రామాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ముందుండి నిర్వహిస్తామని భరత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సర్పంచ్‌గా ఎలికట్టి భరత్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని గ్రామ పెద్దలు విశ్వాసం వ్యక్తం చేశారు.





