అమెరికా ఎన్నికల్లో ఈ మధ్య ట్రంప్ అఖండ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా డోనాల్డ్ ట్రంప్ మన భారతదేశానికి ట్యాక్స్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారతదేశం అధికంగా టాక్స్లు విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఇకపై ఇలానే కొనసాగితే మేము కూడా భారత దేశ ఉత్పత్తులపై 100% ట్యాక్స్ లు విధిస్తామని ఫైర్ అయ్యారు.
మూడో రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
డోనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అమెరికా మరియు చైనా దేశాల మధ్య వ్యాపార,వాణిజ్య సంబంధాలు అలాగే అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై డోనాల్డ్ ట్రంప్ మీడియాతో సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ చాలా దేశాలు అమెరికా ఉత్పత్తులపై టాక్స్ లు విధిస్తున్నాయని, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయ దేశాల వస్తువుల ఉత్పత్తులపై ఎటువంటి టాక్స్ విధించడం లేదు అని అన్నారు.
ఉగాండాలో డింగా… డింగా మహమ్మారి!.. 300కు పైగా కేసులు?
ఇకపై మీరు మా దేశ ఉత్పత్తులపై టాక్స్ విధిస్తే మేము కూడా ఆయా దేశాలు పై టాక్స్లు విధిస్తామని ట్రంప్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి అధిక మొత్తంలో ఉత్పత్తులపై పన్నులు విధించే జాబితాలో భారతదేశం మరియు బ్రెజిల్ దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపై భారత్ మరియు బ్రెజిల్ దేశాలు మా ఉత్పత్తులపై 100% ట్యాక్స్ లు విధిస్తే మేము కూడా మీ ఉత్పత్తులపై 100% ట్యాక్స్లు విధిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రతి వస్తువు ఉత్పత్తి పై ఏకంగా 100 నుంచి 200 రూపాయల వరకు భారత్ మరియు బ్రెజిల్ దేశాలు వసూలు చేస్తున్నాయని అన్నారు. ఇక పై మేం కూడా అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.