
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత ప్రధానమంత్రి మరియు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తాను చైనా అధ్యక్షుడితో కచ్చితంగా సమావేశమై మాట్లాడుతానని, అన్ని వివరాలు తెలుసుకుంటానని అన్నారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనా దేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నానే గాని గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో అన్ని ప్రధాన దేశాలన్నీ కూడా కలిసి పని చేయాలన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అలా కాదని ప్రతి కారం కోసం ఒకరిపై ఒకరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన దేశాల ప్రజలే నష్టపోతారని అన్నారు. ప్రతీకారాల కోసం ఉపయోగించే మొత్తం డబ్బుని ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు పెడితే మంచి జరుగుతుందని అన్నారు.
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా, మోడీ కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. చైనా తో వాణిజ్యం మరియు యుద్ధం గురించి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. చైనా ను ఎదుర్కోవడంలో భారత్ మరియు అమెరికా సంబంధాలను మీరు ఎలా చూస్తారని డోనాల్డ్ ట్రంప్ ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి సమాధానం గా మాట్లాడిన ట్రంప్… చైనాతో మా సంబంధాలు చాలా బాగుంటాయని నేను భావిస్తున్నాను. కోవిడ్ 19 కి ముందు కూడా నాకు చైనా అధ్యక్షుడికి మంచి సంబంధాలు ఉండేవని అన్నారు. ప్రపంచంలో చైనా చాలా ముఖ్యమైన దేశం. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో చైనా అధ్యక్షుడు మాకు సహాయం చేయగలరని నేను భావిస్తున్నానని అన్నారు. చైనా, భారత్, రష్యా మరియు అమెరికా కలిసి పని చేయగలరని నేను ఆశిస్తున్నానని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా అని చెప్పారు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రాణా,ను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?