
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ మధ్యకాలంలో పుట్టింటి మరియు అత్తింటివారికి ఆస్తి పంపకాల సమస్యలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. ఎవరైనా సరే మహిళా చనిపోయిన తర్వాత వారి ఆస్తిని పుట్టింటికి ఇవ్వాళ లేక అత్తింటి వారికే ఉంచాలా అనే విషయంపై సుప్రీంకోర్టు సైతం కీలక సూచనలు చేసింది. ఎవరైనా సరే హిందూ మహిళ చనిపోతే ఆమె మరణాంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో ముందుగానే వీలునామ రాసుకోవాలని సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఎందుకంటే మహిళలు చనిపోయాక ఆస్తులు విషయంలో పుట్టింటికి మరియు అత్తింటి వారికి వివాదాలు వస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. తాజాగా వారసత్వం చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ ఒక మహిళా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేయగా.. ఈ విషయంపై విచారణ చేసిన ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరైతే హిందూ మహిళలు పిల్లలు లేకుండా చనిపోయారో.. చట్టం ప్రకారం ఆమె ఆస్తులు అన్నీ కూడా భర్త ఫ్యామిలీకే చెందుతాయి అని సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం చేసింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలా కాదు అని ఎవరైనా సరే కావాలనే వివాదాలు సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి స్పష్టం చేసింది.
Read also : FIFA వరల్డ్ కప్ అర్హత సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన అతి చిన్న దేశం!
Read also : ఇందిరమ్మ చీరలు పంపిణీ.. మొదట గ్రామాల్లో మాత్రమే?





