
క్రైమ్ మిర్రర్,ఆంధ్ర ప్రదేశ్ :-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి OG సినిమా రేపు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశమంతటా కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందనేది పక్కన పెడితే.. సినిమాకి హైప్ మాత్రం మామూలుగా లేదు. అయితే ఈ సినిమా గురించి వైసీపీ పార్టీ నాయకులు చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం బాధ్యతలు వదిలేసి సినిమాల్లో నటిస్తున్నావు.. ఇంతకుముందు రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడక పోవడంతో ఈ సినిమాకి రేట్లు పెంచావా?.. ఇది అధికార దుర్వినియోగం కాదా?.. అని ప్రశ్నించారు.
Read also : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గెలుపు కోసం బీఆర్ఎస్ సన్నద్ధం
ఇప్పుడు మళ్లీ ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ OG సినిమాపై చేసిన ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. OG అంటే ఒంటరిగా గెలవలేడని అర్థమా?.. అని పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టు కొద్ది క్షణాల్లోనే వైరల్ అవ్వడం, ఈ పోస్ట్ ని చూసిన జనసేన అభిమానులు, కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. గత ఎన్నికలలో 21 సీట్లకు గాను 21 సీట్లు సంపాదించి 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన విషయం మీకు గుర్తు లేదా?.. అని ప్రశ్నిస్తున్నారు. మాకు వచ్చిన సీట్లు కూడా మీకు రాలేకపోయాయని… కేవలం 11 సీట్లు సంపాదించి ఇలా ట్వీట్స్ చేయడం మీకే సిగ్గుచేటని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా OG ఫుల్ మీనింగ్ ఓజెస్ గంభీర అని చిత్ర బృందం గతంలోనే చాలా సందర్భాల్లో తెలిపింది.
Read also : జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయమంటూ పొన్నం ప్రభాకర్ జోస్యం!