క్రైమ్తెలంగాణ

వాచ్మెన్ చేత కుట్లు వేయించిన డాక్టర్.. ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!

మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలిలోనే గాజు పెంకు ఉంచి వాచ్మెన్ కుట్లు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహేశ్వరం మండలం కేంద్రలోని ప్రభుత్వం ఆసుపత్రిలో గత నెల 27వ తేదీ న నందిగామ గిరి వర్మ అనే బాలుడు సాయంత్రం సమయంలో బయట ఆడుకుంటుండగా గాజు పెంకు కాలికి గుచ్చుకోవడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు.డ్యూటీలో ఉన్న డాక్టర్ నిర్లక్ష్యంగా ఉండడంతో పాటు.. అక్కడే డ్యూటీ లో ఉన్న గేట్ వాచ్మెన చేత కుట్లు వేయించాడు.ఆ వాచ్మెన్ గాజు పెంకు కాలిలో ఉండగానే మర్చిపోయి కుట్లు వేసాడు. ఇది అంతా గమనించని ఆ బాలుడు.. గాయం తగ్గిపోయింది అనుకుని.. ఇంటికి వెళ్ళిపోయారు. కానీ కాలు వాపు పదే పదే రావడం గమనించాడు. భయంతో ఒక రెండు రోజులు గడిచిన అనంతంరం మరల హాస్పిటల్ కు వెళ్ళగా మాత్రలు రాసి పంపించారు. ఆల మూడు సార్లు వచ్చిన అదే పద్ధతిలో మాత్రలు ఇచ్చి బాలుడిని పంపించారు.అయినా కాలు వాపు మరింత రావడంతో  ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ తియగా గాజు పెంకు ఉందిని డాక్టర్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం అతనికి సర్జరీ చేసి గాజు పెంకు బయటకు తీసారూ.పేద ప్రజలు ప్రవైట్ ఆసుపత్రి వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్లు ఇలా నిర్లక్ష్యం చేస్తే పేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలి అన్ని బాధితులు ప్రశ్నించారు. అలాగే బాలుడిని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పైన తగిన చర్యలు తీసుకోవాలిని బాధితులు డిమాండ్ చేశారు.

Read also : మైనర్లు వాహనం నడిపితే తల్లి దండ్రులే బాధ్యులు: సీఐ రవి కుమార్

Read also : అన్నా చెల్లెళ్ల అనుబంధమై.. అనురాగాల వెల్లువై.. మదిని మీటే సంబరం రాఖీ పౌర్ణమి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button