
క్రైమ్ మిర్రర్ , వెంకటాపూర్:-మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జవహర్ నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ ను మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.గోపాలరావు జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు పొందేందుకు చేసే మౌలిక ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ పరిసరాలను పరిశీలించి నాటిన ఔషధ మొక్కలను, రికార్డులను, మందుల నిల్వల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు పొందినట్లయితే మౌలిక సదుపాయాలతో పాటు, ప్రజలకు ఉచిత మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని సిబ్బందికి వివరించారు.
ప్రేమ జంట ఆత్మహత్య!… ములుగు జిల్లాలో తీవ్ర విషాదం?
అందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి, జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపును పొందాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సమయపాలన పాటించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, జాతీయ కార్యక్రమాల లక్ష్యాలను 100 శాతం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసూతులను చేయించాలని సిబ్బంది, ఆశాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సంఘమిత్ర, ఆరోగ్య కార్యకర్త ఫాతి మున్నీసా, స్వర్ణలత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరిపోయే దీపంలా కేటీఆర్ మాటలు!.. కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే?