లైఫ్ స్టైల్

నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే!

క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ న్యూస్ :- చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో అత్యవసరమైన వస్తువులు ఉంటాయో లేదో తెలియదు కానీ.. ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే. ఒకప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లోనే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉండాల్సిందే. ఇక చిన్నపిల్లలు మారం చేస్తే.. కచ్చితంగా మొబైల్ ఫోన్ చూపించనిదే అన్నం కూడా తినడం లేదు. దీంతో తల్లిదండ్రులే దగ్గరుండి మరి పిల్లలకు మొబైల్స్ ఇచ్చి ఆహారాన్ని తినిపిస్తున్నారు.

Read also : జీతం రూ. 15 వేలు.. ఆస్తి రూ. 30 కోట్లు!

ఇదిలా ఉండగా… ఉదయాన్నే ఫోన్ చూడడం అనేది ఎన్నో అనర్థాలకు అలాగే ఆరోగ్యానికి కూడా హానికరం. ఆరోగ్యానికి హానికరం.. అని తెలిసినా కూడా చాలామంది ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ఫోన్స్ చూస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. ఫోన్ చూడడం ఒక అనర్థమైతే… అందులో ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నెగిటివ్ విషయాలు చూడడం మరొక హానికరమైన విషయం. ఎందుకంటే ఉదయం లేవగానే నెగిటివ్ విషయాలు చూడడం వల్ల ఆ రోజంతా కూడా మనకు ఇన్ నెగిటివ్ ప్రభావం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేచిన వెంటనే.. నెగిటివ్ విషయాలకు సంబంధించి సమాచారాన్ని చదివినప్పుడు అది ఆ రోజంతా ఉండడంతో పాటుగా.. మెదడుపై కూడా ఎక్కువ భారాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైన సందర్భంలో.. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి చెత్తకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి.

Read also : రూట్, ప్రసిద్ కృష్ణ మధ్య గొడవ.. అండగా నిలిచిన KL రాహుల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button