
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :-తప్పుచేసి జైలుకు వెళ్లిన కొందరిని అన్ని పరిశీలించిన తర్వాత కఠినమైన నేరాలు రుజువైతే కొంతమందికి ఉరిశిక్ష వేస్తారు. ఇవి మనం చాలాచోట్ల వింటూనే ఉన్నాం. కొన్నిసార్లు సినిమాలలో,సీరియల్స్ లో, మరికొన్నిసార్లు సోషల్ మీడియాలలో.. ఇంకొన్నిసార్లు వార్తల్లో ఎక్కడో ఒకచోట చూసే ఉంటాం. అయితే మరణశిక్ష అమలు చేసే సమయంలో ఖైదీ చివరి కోరికను అడగడం పక్క. అసలు ఇలా మనిషిని ఉరిశిక్ష వేసే ముందు కోరిక అడగడం ఏంటి అని?.. ఒకవేళ నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే… మరణ శిక్ష రద్దు చేయండి అంటే ఆ కోరిక కూడా జడ్జిలు తీరుస్తారా..? ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరి మెదడులో మెదులుతూ ఉంటాయి.
Read also : బీజేపీ తెలంగాణ కమిటీ ఏర్పాటు… ఏడు మోర్చాలకు అధ్యక్షుల నియమాకం
అసలు మరణ శిక్ష విధించే సమయంలో ఖైదీ చివరి కోరికను అడగడం అనే ఆచారం మొట్టమొదటిగా ఇంగ్లాండ్లో 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇక మత విశ్వాసాల ప్రభావం అలాగే మానవత్వంతో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా సాంప్రదాయంగా మారిపోయింది. కేవలం మన భారతదేశంలోని చాలాచోట్ల ఇది జరుగుతుంది. ఉరి శిక్ష లేదా మరణశిక్ష అనే పదాలు మానవ చరిత్రలో అత్యంత తీవ్రమైన శిక్షలలో ఒకటిగా భావిస్తాం. వేల సంవత్సరాలుగా ఎన్నో నేరాలను అరికట్టడానికి, సమాజంలో భయం కలిగించడానికి ఈ శిక్షలను అనేవి అమలు చేస్తూ ఉంటారు. ఇలానే ఉరిశిక్ష అమలు చేసే ముందు ఖైదీని చివరి కోరిక అడగడం కూడా సంప్రదాయంగా మారిపోయింది. అప్పట్లో కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలుగా మారుతారు అని ప్రజలు నమ్మేవారు. చివరి కోరిక నెరవేర్చకపోతే అతను ఆత్మగా మారి కొంతమందిని పీడిస్తారని కలిగి ఉండేవారు. అందుకే అప్పటినుంచి ఖైదీని కోరికలు అడిగి తీర్చుతారు. అలాగే ఆ కోరికలు కూడా ఎలాంటివంటే… ఎవరినైనా కలవాలి అనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, చివరిసారిగా చూడాలనుకుంటున్నారా, ఏమైనా తినాలనుకుంటున్నారా?.. ఇలా చేయగలిగే పనులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. నాకు ఈ ఉరి శిక్షణ రద్దు చేయండి.. లేదా కొన్ని రోజులు వాయిదా వేయండి.. ఇలాంటివి పరిగణలోకి తీసుకోరు. ఇక ఇంతకు మించి ఏ కోరిక కోరిన కూడా అది లెక్కలోకి రాదు. ఇక ఆ తరువాత తక్షణమే ఉరిశిక్ష అనేది అమలు చేస్తారు.
Read also : విచారణ చేపట్టిన విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు..