అంతర్జాతీయం

ప్రపంచంలోనే అతి పెద్ద అపార్ట్మెంట్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?

కెపాసిటీ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా ప్రస్తుత రోజుల్లో ఎక్కడపడితే అక్కడ పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తూనే ఉన్నాయి. సిటీలలో అయితే ఈ అపార్ట్మెంట్లనేవి ఇంకా ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ ఆనాటి కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన సిటీలలో మాత్రమే పెద్దా అపార్ట్మెంట్లు మనకి కనిపించేవి. కానీ ప్రస్తుత రోజుల్లో హైదరాబాద్ కానీ అలాగే వైజాగ్ సిటీలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలులో పెద్దపెద్ద అపార్ట్మెంట్లు వెలిసిపోతున్నయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది పట్టణాలకు వలసలు రావడంతో అలాగే రియల్ ఎస్టేట్ భారీగా ఎదగడంతో పట్టణాలలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ అనేవి కట్టడానికి మొగ్గుచూపుతున్నారు.

అయితే ప్రపంచంలోనే పెద్ద అపార్ట్మెంట్ చైనాలోని హాంగ్ జౌ నగరం, కియాన్ జియాంగ్ సెంచరీ సిటీలో ఉంది. ఈ అపార్ట్మెంట్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇందులో ఏకంగా 20,000 మందకి పైగా జనాలు నివసించగలరు. దీని పేరే రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అనేది 14 లక్షలు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండడంతో పాటు ఏకంగా 675 అడుగులు ఎత్తు కూడా ఉంది. ఈ రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్ అనేది ‘s’ ఆకారంలో ఉంటుంది. అలాగే ఈ అపార్ట్మెంట్లో 39 అంతస్తులు కూడా ఉన్నాయట. ప్రతి అంతస్తులోనూ ఖరీదైన అపార్ట్మెంట్లు, అలాగే ఫర్నిచర్స్ కూడా చాలానే ఉన్నాయి.

Read More : దేవుడు చెంత ఇవేం పనులు రా బాబు!… డ్యూటీలు ఎగ్గొట్టి మరీ పేకాట ఆడిన పోలీసులు!

బిల్డింగ్ సిటీ అని పిలుచుకునే అపార్ట్మెంట్ ఒక చిన్న నగరంలో ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి 20,000 మంది ప్రజలకు కావాల్సినవన్నీ కూడా అపార్ట్మెంట్ లోపల దొరుకుతాయని కూడా సోషల్ మీడియాలో ఎన్నోసార్లు మనం వినే ఉంటాం. అక్కడున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఆ అపార్ట్మెంట్లోనే దొరుకుతాయట. ధీంతో అక్కడ ఉన్న ప్రజలు బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా కూడా పేరు తెచ్చుకుంది. అయితే ఈ రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్ అనేది కేవలం చైనాలోనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఇటువంటి అపార్ట్మెంట్ అనేది లేదు. అంతేకాకుండా 20వేలకు పైగా జనాభా ఒక అపార్ట్మెంట్ లోనే నివసించడంతో ఈ అపార్ట్మెంట్ అనేది కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్ గురించి తెగ వెతికేస్తున్నారు.

ప్రస్తుతం ఇటువంటి అపార్ట్మెంట్లు ఏ దేశంలోనూ లేవు కానీ.. భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా ఇటువంటివి చాలానే పుట్టుక వస్తాయని ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఒక్కసారి అయినా అపార్ట్మెంట్ను తనివి తీరా చూడాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button