ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ వైపు మళ్లిన కేశినేని నాని మనస్సు - పొలిటికల్‌ రీఎంట్రో ఎప్పుడో తెలుసా...!

కేశినేని నాని… రాజకీయాలకు రాంరాం అని చెప్పి సరిగ్గా 10 నెలలైనా గడిచిందో లేదో… అప్పుడే రీ ఎంట్రీ కోసం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయన్ను తమ పార్టీలోకి మళ్లీ ఆహ్వానించాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే… నాని మనసు మాత్రం బీజేపీ వైపు ఉన్నట్టు సమాచారం. మరి… కేశినేని బీజేపీలోకి వెళ్తారా… వైసీపీవైపే మొగ్గుచూపుతారా…! అసలు పొలిటికల్‌ రీఎంట్రీకి మూహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారో..?

2024 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు కేశినేని నాని. ఆ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేశినేని నానికి కూడా తమ్ముడి చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో… రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ… ఈ మధ్య మళ్లీ నియోజకవర్గ పర్యటనలతో హడావుడి చేస్తున్నారు కేశినేని నాని. సోదరుడు కేశినేని చిన్నిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తమ్ముడి అవినీతిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కేశినేని చిన్ని పాత్ర ఉంటూ… సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు కేశినేని నాని. రోజూ వార్తల్లో ఉంటూ… మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు ఉన్నారు కేశినేని నాని.

రాజకీయంగా కేశినేని నాని మళ్లీ యాక్టివ్‌ కావడంతో… వైసీపీ నేతలు ఆయన్ను అప్రోచ్‌ అయ్యారు. వైసీపీలోకి తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నారు. వైసీపీకి చెందిన యువ నేత కేశినేని నానిని కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే.. నాని.. వైసీపీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. ఆ పార్టీని రెండో ప్రియారిటీగా పెట్టుకున్నట్టు ఉన్నారు. ఆయన మొదటి ప్రాధాన్యత బీజేపీగా తెలుస్తోంది. కమలం పార్టీలోకి జంప్‌ అయ్యేందుకు కేశినేని నాని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కేశినేని నానికి మంచి పరిచయాలు ఉన్నాయి. కనుక వచ్చే ఎన్నికలలోపు బీజేపీలో చేరి… ఆ పార్టీ తరపున విజయవాడ ఎంపీగా పోటీచేయాలన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో…. ఏ పార్టీలోకి వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని అంటున్నారు కేశినేని నాని.

బీజేపీలోకి వెళ్లాలని కేశినేని నాని ప్రయత్నించినా… అది అంత ఈజీ కాదు. ఎందుకంటే… ఏపీలోని కూటమి పార్టీల్లో టీడీపీ కూడా ఉంది. గత ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీలోకి వెళ్లారు నాని. కనుక… ఆయనకు కూటమిలోకి ఎంట్రీ ఉండదనే చెప్పొచ్చు. టీడీటీ కాదంటే… బీజేపీ నేతలు కూడా కేశినాని నాని చేరికను అంగీకరించలేరు. అందుకే… బీజేపీ తర్వాత వైసీపీని ఆప్షన్‌గా పెట్టుకున్నారు నాని. పార్టీ ఏదైనా… కేశినేని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆయనే తేల్చుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button