
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- IBOMMA రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ తరువాత రవి నుంచి అధికారులు ఎంతగానో కొన్ని విషయాలను బయటకు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాలను పైరసీ చేసి ఓటిటిలో విడుదలైన రోజునే తమ ఐ బొమ్మ అలాగే బప్పం వెబ్సైట్ లో విడుదల చేసిన రవి ని ఊరికే వదిలి పెట్టకూడదు అని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఐ బొమ్మ రవికి ఎటువంటి శిక్ష పడుతుందా అనే ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం రవిని అరెస్ట్ చేసిన పోలీసులు IT చట్టం ప్రకారం 66C, E, BNS 318(4) R/W 3(5), కాపీ రైట్ యాక్ట్ 63 మరియు 65 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. కానీ ఇంకా నేరం రుజువు కాలేదని.. ఒకవేళ నేరం రుజువైతే అనుమతులు లేకుండా ఇతరుల ఐడీలు మరియు ఫోటోలు తీసుకున్నందుకుగాను IT ACT66C, E కింద 3-7 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఒకటి లేదా రెండు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అక్రమంగా ఇతరుల ఆస్తి తస్కరణ పై 318(4) యాక్ట్ కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది అని అంటున్నారు. కేవలం కాపీరైటీ ఆక్ట్ ప్రకారం అయితే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతో ఎటు చూసినా కూడా ఈ ఇమ్మడి రవికి దాదాపు జైలు శిక్ష అయితే ఖాయం. కానీ ఎన్నేళ్లు అనేది చట్టం ప్రకారం కోర్టు నిర్ణయిస్తుంది అని అధికారులు తెలిపారు. కాగా రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఫ్రీజ్ చేశారు. మరోవైపు ఎంతమంది బయోడేటా వాళ్ల దగ్గర ఉంది అని పోలీసులు చెప్తూనే ఉన్నారు. మరికొద్ది రోజులు ఆగితే కానీ రవికి ఎన్నేళ్లపాటు జీల శిక్ష పడుతుంది అనేది తెలియదు.
Read also : వారణాసి టైటిల్ పై వివాదం.. ఎందుకంటే?
Read also : బయట ప్రపంచం ప్రమాదం అంటూ.. రెండేళ్ల పాటు బాలికను ఇంట్లోనే బంధించిన తల్లి! కారణం ఏంటంటే?





