
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య మరియు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన నిన్న గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఈయన ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల కాథలిక్ క్రైస్తవులకు మత గురువు. డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్టులో.. అనారోగ్య సమస్యల కారణంగా గుండెపోటుతో మరణించారని స్పష్టంగా వెలువబడింది. మరణానికి కొద్దిసేపటి క్రితమే అతను కోమాలోకి వెళ్లినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. దీంతో పోప్ మరణం విని ప్రపంచవ్యాప్తంగా కాథలిక్ క్రైస్తవులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 14 గురించి దాదాపు 38 రోజులు పాటుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మార్చిలో డిశ్చార్జ్ అయ్యారు.
ఈ అనారోగ్యం కారణంగానే ఆయన తాజాగా జరిగిన ఈస్టర్ వేడుకల్లో కూడా పాల్గొనలేకపోయారు. పోప్ మరణించిన 15 నుండి 20 రోజుల్లోనే తర్వాతే ఎన్నుకునేందుకు పాపల్ సమావేశం అనేది జరుగుతుంది. పోప్ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలను ఎలాంటి ఆడంబరం లేకుండా నిర్వహించాలని అన్నారట. అంతేకాకుండా మట్టిలోనే పూడ్చివేయాలని, ఇన్స్క్రిప్షన్ పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని పోప్ ముందుగానే చెప్పారట. ఇవే తన చివరి కోరికలని చెబుతున్నారు. ఈస్టర్ మరుసటి రోజే ఆయన కన్నుమూయడం చాలా విషాదకరమైన విషయమని క్రైస్తవులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
బండి రమేష్ సహకారంతో అల్లాపూర్ అభివృద్ధి- మొయినుద్దీన్, మస్తాన్ రెడ్డి