అంతర్జాతీయం

మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ దేశాల్లో పని చేస్తాయో తెలుసా?

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
మన ఇండియాలో డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా అవసరం. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కచ్చితంగా పోలీసులు ఫైన్లు వేస్తుంటారు. అలాగే ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్న సమయంలోను ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి అవుతుంది. ప్రస్తుత రోజుల్లో టూ వీలర్స్ కు లేకపోయినా ఫోర్ వీలర్స్ అలాగే ఆపై ఎంత పెద్ద వాహనానికైనా సరే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా అవసరం. ప్రస్తుత సిట్యూవేషన్ లో ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ ఇతర దేశాల్లో పని చేస్తాయా లేదా అనేది ఆలోచిస్తున్నారు. అయితే ఇండియాలో తీసుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, యూకే, జర్మనీ, స్వీడన్, మలేషియా, స్పెయిన్, కెనడా, నార్వే మరియు ఐర్లాండ్ వంటి దేశాలలో ఆరు నెలల నుంచి దాదాపు సంవత్సరం వరకు మన లైసెన్స్ చెల్లుబాటు అవుతాయి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లో ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీషులోనే ప్రింట్ అయి ఉండాలి. మారిషస్ లో ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుతుంది. ఇటలీలో మన భారత లైసెన్స్ తో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటేనే డ్రైవింగ్ కు అనుమతి అనేది ఉంటుంది. ఇలా ఏ దేశంలోనైనా సరే మన లైసెన్స్ చెల్లుతుంది అని ఎప్పుడూ కూడా అనుకోకండి. అలాగే ఈ విషయాన్ని మీ తోటి బంధువులకు అలాగే మీ మిత్రులకు తెలియజేయండి.

బ్రేకింగ్ న్యూస్.. టెన్త్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇదే?

చెంచుల సమస్యలు…చెంచుల చెంతకే జిల్లా కలెక్టర్ త్రిపాఠి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button