
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి రెండేళ్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన పథకాలకు ఇప్పటివరకు ఖర్చుపెట్టిన డబ్బు వివరాలను తెలియజేసింది. గడిచిన రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలకు 76,382 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఒక్కొక్క పథకానికి ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అనే వివరాలను కూడా స్పష్టంగా తెలిపింది. అలాగే గడిచిన రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 61,379 ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.
రెండేళ్లలో 6 గ్యారెంటీలకు ఖర్చు చేసిన డబ్బు :-
1. ఆర్టీసీ మహిళల ఉచిత ప్రయాణం :- 8,042 కోట్లు
2. గృహ జ్యోతి :- 3,438 కోట్లు
3. ఇందిరమ్మ ఇల్లు :- 3,200 కోట్లు
4. ఆరోగ్యశ్రీ :- 3,000 కోట్లు
5. రైతు భరోసా :- 20,616 కోట్లు
6. యంగ్ ఇండియా స్కూల్స్ :- 15,600 కోట్లు
7. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ :- 700 కోట్లు
Read also : ఈ యుద్ధాలు ఇంతటితో ఆగాలి.. 8 ఆపాను.. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది : ట్రంప్
Read also : పుట్టినరోజు నాడున 400 మంది పేదల కడుపు నింపిన విద్యార్థి మోక్షిత్





