
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించినటువంటి సినిమా మిరాయ్. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాను చూడడానికి చాలా మంది ప్రేక్షకులు సినిమా ధియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఒడియాకు చెందిన రితిక నాయక్ నటించారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ రితికాకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా పెరిగిపోయింది. కుర్ర కారుకు ఇప్పుడు ఈ హీరోయిన్ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన మంచు మనోజ్ కు ఈ సినిమా ద్వారా క్రేజ్ మరింత పెరిగిపోయింది. మంచు మనోజ్ ఈ సినిమా ద్వారా మంచి కంబ్యాక్ ఇచ్చారని.. చాలా రోజుల తర్వాత ఒక మంచి సక్సెస్ అందుకున్నారని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.
Read also : మరో 5 రోజులు పాటు భారీ వర్షాలు.. అయోమయంలో ప్రజలు!
విలన్ పాత్రలో నటించిన మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు అనేది బయట ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు ఆడియన్స్ అందరూ కూడా ఫిదా అయ్యారు. మనోజ్ నటించింది నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా ఆ పాత్రకు చాలా వెయిటేజ్ ఉంది. కొన్ని నివేదికల ప్రకారం మంచు మనోజ్ ఈ సినిమాలో నటనకు దాదాపు 2.75 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం అందింది. అయితే ఒక నెగిటివ్ పాత్రకు ఇంత పారితోషికం అనేది ఎక్కువనే చెప్పాలి. మనోజ్ స్క్రీన్ ప్రజెంట్ కు ఉన్న డిమాండ్ ను మరోసారి రుజువు చేసుకున్నారు. మనోజ్ తాజాగా నటించినటువంటి భైరవం సినిమాలో దాదాపు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. మంచు మనోజ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ… ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్ మాటలను ఆయన ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఆలకిస్తారు. ఎప్పుడు నవ్వుతూ.. ఫ్యాన్స్ ను బాగా పలకరిస్తూ, ఈవెంట్లలో బాగా ఇంట్రాక్ట్ అవడం మంచు మనోజ్ ఏది చేసిన కూడా అది ఫాన్స్ కు బాగా నచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మంచు మనోజ్ సినిమా కెరియర్ పరంగా భారీ మార్కెట్ ఏర్పడకపోయినా కూడా… భవిష్యత్తులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. మీరాయ్ సినిమాతో సక్సెస్ అందుకున్న మనోజ్.. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండే ఛాన్స్ ఉంది.
Read also : ఆ విమానంలో నేను కూడా ప్రయాణించాల్సి ఉంది.. కానీ : మీనా