
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా తుదిదశకు చేరుకుంది. జవనరి 13న ప్రారంభమైన కుంభమేళా… ఇవాళ్టితో (బుధవారం) ముగుస్తుంది. నేడు శివరాత్రి కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. కుంభమేళాలో ఇదే చివరి అమృత స్నానం. దీంతో… భక్తులు ఇంకా తరలివస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రికే సుమారు కోటి మంది భక్తులు త్రివేణి సంగమం చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇంకా… భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతుండటంతో… అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా… జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్రివేణి సంగమం దగ్గర 50వేల మంది పోలీసులను మోహరించారు. ఏఐ కెమెరాలతో ఎప్పటి కప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు అధికారులు.
మరోవైపు… త్రివేణి సంగమం… భక్తజనసంద్రంగా మారింది. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఇవాళే ఆఖరు కావడంతో… భక్తులు అమృత స్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇక… పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపిస్తున్నారు అధికారులు. మహాశివరాత్రి కావవడంతో.. శివనామస్మరణ చేస్తూ… పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత వారణాసి, అయోధ్యను కూడా దర్శించుకుంటున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న పుష్య మాసంలోని పౌర్ణమి తిధిలో కుంభమేళా ప్రారంభమైంది. 144ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. సుమారు 60 కోట్ల మందిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని ఆంచనా వేస్తున్నారు. మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో చేసే స్నానాలను.. పుణ్యస్నానాలు, అమృతస్నానాలు, రాజస్నానం అని పిలుస్తారు. ఈసారి మొత్తం ఆరు పుణ్యస్నానాలు జరిగాయి. తొలిసారి అంటే జనవరి 13న పుష్య పౌర్ణమి రోజు.. మొదటి పుణ్యస్నానం, రెండోది జనవరి 14న సంక్రాంతి రోజు, మూడోది జనవరి 29న మౌని అమావాస్య రోజు జరిగింది. ఇక… నాలుగోది అమృత స్నానం… ఫిబ్రవరి 3న వసంత పంచమినాడు, 5వ స్నానం ఫిబ్రవరి 12న మాఘ అమావాన్య రోజు… 6వ స్నానం… మహాశివరాత్రి రోజు జరిగింది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారికి ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని… పాప విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.