
క్రైమ్ మిర్రర్,లైఫ్ స్టైల్ న్యూస్:- సాధారణంగా ఉదయం నిద్రలేచిన వెంటనే చాలామంది చాలా యాక్టివ్ గా ఉండడం గమనిస్తూ ఉంటాం. అయితే కొంతమంది లేచిన వెంటనే బద్ధకంగా ఉన్నట్లు అనిపిస్తారు. మరి కొంతమంది నిద్రలేచిన వెంటనే కాస్త అలసటగా ఉన్నట్లు గమనిస్తూ ఉంటాం. తాజాగా వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపించినవారు పలు ఆరోగ్య సమస్యలకు గురయ్యారని సంకేతమని హెచ్చరించారు. ముఖ్యంగా లేచిన వెంటనే అలసట అనిపిస్తే అది షుగర్ వ్యాధికి సంకేతమని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే రక్తంలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు మన శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ తారుమారవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో లేవ గానే అలసట, గొంతు ఎండిపోవడం అలాగే కంటి చూపు కూడా మందగించడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయని డాక్టర్లు అంటున్నారు. ఏదో ఒక రోజు లేదా రెండు రోజులు కనిపిస్తే అది పెద్ద సమస్య కాదని కానీ ప్రతిరోజు కూడా ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని… లేదంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంపాదించండి.
Read also : తెలుగు రాష్ట్రాల్లో భీకర వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
Read also : అంతా సజావుగా జరిగింది.. నేడు విధుల్లోకి అడుగుపెట్టనున్న నూతన టీచర్లు