జాతీయంవైరల్

కాకులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయంటే నమ్ముతారా?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన పూర్వికులు కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కాకి మన ఇంటి ముందు అరిచింది అంటే ఆ ఇంటికి ఎవరు అతిధులు వస్తున్నట్లు అర్థం చేసుకోవాలని మన పూర్వీకులు ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటారు. ఇక ప్రస్తుత రోజుల్లో ఒక కాకి చనిపోయిందంటే మిగతా అన్ని కాకులు ఆ కాకి చుట్టూ గుంపు గుంపులుగా చేరుతాయి. ఈ దృశ్యాలను గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులైతే ఎన్నో సందర్భాల్లో చూసి ఉంటారు. సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ దాని చుట్టూ చేరి పెద్ద ఎత్తున కావు కావు అని అరుస్తూ ఉంటాయి. అలా కాకులు గుంపుగా చేరి.. ఎందుకు ఈ కాకి మృతి చెందింది.. ఈ ప్రాంతంలో ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అని ప్రతి ఒక్కటి కూడా ఆరాధిస్తాయట . ఈ ఘటనలో ప్రమాదకరమైనటువంటి మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో ఆ మనిషి లేదా ప్రాంతం పట్ల జాగ్రత్తలు వహిస్తాయట. సింపుల్ గా ఇదే విషయాన్ని మనం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే మనం మనుషుల్లో కూడా ఒక మనిషి చనిపోతే ఖచ్చితంగా పోలీసులు ఆ మృతికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాం. మనలాగే కాకులు కూడా ఏదైనా ఒక కాకి చనిపోతే ఆ కాకి చనిపోవడానికి గల కారణాలను మిగతా కాకులు అన్ని గుంపులుగా చేరి పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ లా పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటాయట. ఈ విధంగానే కాకులు తమ వంశాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్తుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది.. ఎవరో అతిధులు వస్తారు అనేది మొత్తం మూఢ నమ్మకం అని పరిశోధనలు తేల్చి చెప్పారు.

Read also : Good News: జస్ట్ రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

Read also : తెలుగు హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి.. క్లారిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button